Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:41 AM

యాదగిరిగుట్టలో ‘అరైవ్ అలైవ్’ – రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు

11-04-2026 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా, డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “అరైవ్ అలైవ్” క్యాంపెయిన్-2026 కార్యక్రమం యాదగిరిగుట్టలో నిర్వహించారు.

ఈ సందర్భంగా మండలంలోని ప్రభుత్వ శాఖల అధికారులు, మున్సిపాలిటీ చైర్మన్, కౌన్సిలర్లు, గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఈనెల 13 నుంచి 18 వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

సీసీ కెమెరాల ప్రాముఖ్యత, రోడ్డు భద్రత నియమాలు కచ్చితంగా పాటించాలని సూచించారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని, సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్టులపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.

యువతను గంజాయి, డ్రగ్స్ నుంచి దూరంగా ఉంచాలని, డ్రంక్ అండ్ డ్రైవ్, రాష్ డ్రైవింగ్‌ను నివారించాలని సూచించారు. ఎటువంటి సమస్య వచ్చినా 100 నంబర్‌కు కాల్ చేసి పోలీసులను సంప్రదించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్, వైస్ చైర్మన్ బరిగే రమ్య రామచందర్, టౌన్ సీఐ భాస్కర్, ట్రాఫిక్ సీఐ కృష్ణ, ఎస్సై యాదయ్య, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

యాదగిరిగుట్టలో ‘అరైవ్ అలైవ్’ – రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News