Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:23 AM

వంశపారంపర్య క్యాన్సర్ల పెరుగుదలపై నిపుణుల హెచ్చరిక

23-04-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ,

నేటి జీవనశైలి మార్పులు, పర్యావరణ ప్రభావాలు, జన్యు ఉత్పరివర్తనాల కారణంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని నిపుణులు తెలిపారు. ముఖ్యంగా ధూమపానం చేయని వారు, యువతలో కూడా ఈ వ్యాధి పెరుగుతుండటం ఆందోళనకరమన్నారు.

సోమాజిగూడ యశోద హాస్పిటల్స్‌కు చెందిన కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డా. హరీష్ కాంచర్ల మాట్లాడుతూ, వంశపారంపర్య క్యాన్సర్లను ముందుగానే గుర్తించేందుకు NGS, PCR వంటి ఆధునాతన పరీక్షలు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. లిక్విడ్ బయాప్సీ వంటి సాధారణ రక్త పరీక్షల ద్వారా ప్రమాదం ఉన్న కుటుంబ సభ్యులకు కూడా ముందస్తు స్క్రీనింగ్ చేయవచ్చని చెప్పారు.

టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ వంటి ఆధునిక చికిత్సలతో రోగుల మనుగడ రేటు, జీవన నాణ్యత మెరుగవుతున్నాయని వివరించారు. లక్షణాలు కనిపించకముందే స్క్రీనింగ్ చేయించుకుంటే చికిత్స ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని సూచించారు.

క్యాన్సర్ కుటుంబ చరిత్ర ఉన్నవారు తప్పనిసరిగా జన్యు సలహా తీసుకుని, సకాలంలో పరీక్షలు చేయించుకోవాలని యశోద హాస్పిటల్స్ నిపుణులు సూచించారు.

మూడు దశాబ్దాలుగా వైద్య సేవలు అందిస్తున్న యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ, సికింద్రాబాద్, మలక్‌పేట్, హైటెక్ సిటీలలో నాలుగు ఆసుపత్రులతో 4000 పడకల సామర్థ్యంతో అత్యాధునిక సాంకేతికతతో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్ మేనేజర్ పరమేష్, డా. హరీష్ కాంచర్ల, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వంశపారంపర్య క్యాన్సర్ల పెరుగుదలపై నిపుణుల హెచ్చరిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News