Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:51 PM

వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలి. వనం ఉపేందర్

09-04-2026 153 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మోత్కూర్: వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎన్‌పీఆర్‌డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ డిమాండ్ చేశారు. గురువారం మోత్కూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్‌పీఆర్‌డీ టౌన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

వికలాంగులకు ప్రత్యేక సంక్షేమ శాఖ ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదని, ప్రస్తుతం శిశు సంక్షేమ శాఖలోనే కొనసాగించడం వల్ల బడ్జెట్ కేటాయింపులు స్పష్టంగా తెలియని పరిస్థితి నెలకొన్నదన్నారు. వెంటనే ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలని కోరారు.

వికలాంగులకు పెండింగ్‌లో ఉన్న పెన్షన్ బకాయిలను విడుదల చేసి, నెలకు రూ.6,000 పెన్షన్‌ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పరికరాల పంపిణీ, ఉపాధి అవకాశాల కోసం రుణాలు ఇప్పటికీ అందడం లేదని, ప్రతి వికలాంగుడికి బ్యాంకుల ద్వారా రూ.10 లక్షల వరకు రుణాలు అందించాలని కోరారు.

అలాగే ఉచిత బస్సు సౌకర్యం, రేషన్ కార్డు ద్వారా 35 కిలోల బియ్యం అందించడంతో పాటు, గ్రామపంచాయతీ నుంచి అసెంబ్లీ, పార్లమెంట్ వరకు నామినేటెడ్ పోస్టుల్లో వికలాంగులకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎన్‌పీఆర్‌డీ నాయకులు గడ్డం యాదగిరి, ఎర్రవెల్లి నాగేష్, గౌలికర్ రాజు, గుండు శ్రీనివాస్, అప్పల యాదగిరి, వెంకటేష్, మంజుల, గొడిశాల యాదగిరి, చేతరాశి రమేష్, జయభిక్షం, ఎండి జమాల్, ఎస్.కె కాశీం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలి. వనం ఉపేందర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News