Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:31 AM

వికలాంగుల సమస్యలపై పోరాటం ఉధృతం. యాదగిరిగుట్ట రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి : ఎన్‌పీఆర్‌డీ

18-05-2026 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట : వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా పోరాట కార్యాచరణ రూపొందించేందుకు ఈనెల 29, 30, 31 తేదీలలో యాదగిరిగుట్టలో నిర్వహించే రాష్ట్ర శిక్షణ తరగతులు, రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని ఎన్‌పీఆర్‌డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ పిలుపునిచ్చారు.

రామన్నపేట మండలం రామన్నపేట టౌన్, తుమ్మలగూడెం గ్రామంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం కరపత్రాన్ని విడుదల చేశారు.

వికలాంగులకు సదరం సర్టిఫికెట్లు వచ్చినా పెన్షన్లు మంజూరు కాకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం బడ్జెట్ లేదనే కారణంతో కొత్త పెన్షన్ల మంజూరులో జాప్యం చేస్తోందని విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

మండలంలో అనేక మంది వికలాంగులు సదరం సర్టిఫికెట్లు, యూడీఐడీ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారని, వాటిని తక్షణమే అందించాలని కోరారు. వికలాంగులకు ఇంద్రమ్మ ఇళ్లు కేటాయించడంతో పాటు స్థలం లేని వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఉపాధి హామీ పథకంలో వికలాంగులకు ప్రత్యేక పనులు కల్పించి, 150 రోజుల ఉపాధితో రోజుకు రూ.600 కూలి చెల్లించాలని కోరారు. కొత్త జాబ్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో గిరికల లింగస్వామి, నాగు నరసింహ, పాలశం పరుశురాం, సువి కిష్టయ్య, లావణ్య, చిన్నోజు శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వికలాంగుల సమస్యలపై పోరాటం ఉధృతం. యాదగిరిగుట్ట రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి : ఎన్‌పీఆర్‌డీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News