Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 06:13 AM

వికలాంగుల పెన్షన్ రూ.6000కు పెంచాలి మార్చి 13న హైదరాబాద్‌లో సామూహిక నిరాహార దీక్షలు,

వికలాంగుల పెన్షన్ రూ.6000కు పెంచాలి మార్చి 13న హైదరాబాద్‌లో సామూహిక నిరాహార దీక్షలు,

వికలాంగుల పెన్షన్ రూ.6000కు పెంచాలి మార్చి 13న హైదరాబాద్‌లో సామూహిక నిరాహార దీక్షలు,
March 09, 2026 01:32 PM 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: వికలాంగుల పెన్షన్‌ను రూ.6000కు పెంచాలని, ఎంపికైన లబ్ధిదారులకు సహాయ పరికరాలను వెంటనే పంపిణీ చేయాలని, బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేస్తూ మార్చి 13న హైదరాబాద్‌లో సామూహిక నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ తెలిపారు.

రామన్నపేట మండలం కక్కిరేణి, జనంపల్లి గ్రామాల్లో నిర్వహించిన గ్రామ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగుల పెన్షన్‌ను రూ.4016 నుంచి రూ.6000కు, చేయూత పెన్షన్‌ను రూ.2016 నుంచి రూ.4000కు పెంచి 2023 డిసెంబర్ నుంచే అమలు చేస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు కాలేదని విమర్శించారు.

2023 అక్టోబర్ నాటికి రాష్ట్రంలో 44,49,767 మందికి పెన్షన్లు అందుతుండగా 2026 జనవరి నాటికి 42,80,129 మందికి మాత్రమే అందుతున్నాయని తెలిపారు. ఈ కాలంలో 1,69,638 మంది పెన్షన్లు రద్దు చేశారని ఆరోపించారు. వికలాంగుల పెన్షన్ల విషయానికి వస్తే 2023 అక్టోబర్ నాటికి 5,14,422 మందికి ఉండగా 2026 జనవరి నాటికి 4,84,850 మందికి మాత్రమే అందుతున్నాయని, 29,572 మందికి పెన్షన్లు రద్దు చేశారని పేర్కొన్నారు.

చేయూత పెన్షన్ల కోసం ప్రతి నెల రూ.994.50 కోట్లు అవసరమని, 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.14,628.91 కోట్లు కేటాయించిన ప్రభుత్వం రూ.10,514.32 కోట్లు మాత్రమే విడుదల చేసిందని విమర్శించారు. కేటాయించిన నిధులను కూడా పూర్తిగా విడుదల చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చూపుతోందన్నారు.

అలాగే సహాయ పరికరాల కోసం 15 వేల మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఎంపికైన లబ్ధిదారులకు ఇప్పటివరకు పరికరాలు పంపిణీ చేయలేదని అన్నారు.

మార్చి 16 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో పెన్షన్ పెంపుపై ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు మార్చి 13న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద జరిగే సామూహిక నిరాహార దీక్షల్లో యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా 17 మండలాల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో పిట్ట శ్రీనివాస్ రెడ్డి, పున్న శ్రీధర్, కన్నబోయిన మంగమ్మ, చిల్ల రమాదేవి, చిల్ల గంగాధర్, కనిపిపోయిన బిక్షం, గుడిసె ఉత్తరమ్మ, గుడిసె వెంకటమ్మ, గూడపూర్ రాములమ్మ, బడే అంజమ్మ, మెడబోయిన రమేష్, సుంకి వెంకటేశం, అక్కనపల్లి మహేష్, సన్ షెట్ వెంకటేశం, ఎండి ఫరీద్, మేడబోయిన ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News