Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:23 AM

వికలాంగుల పెన్షన్ రూ.6,000కు పెంచాలి: ఎన్‌పీఆర్‌డీ

24-04-2026 139 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి వికలాంగుల పెన్షన్‌ను రూ.6,000కు పెంచి వెంటనే అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య డిమాండ్ చేశారు. వికలాంగుల చట్టాలు, సంక్షేమ పథకాల అమలుకు ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

జిల్లా అధ్యక్షుడు సూరపంగా ప్రకాష్ అధ్యక్షతన దుంపల మల్లారెడ్డి స్మారక భవనంలో జరిగిన జిల్లా విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా వికలాంగులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించారు. పెన్షన్లు పెంచడంలో ఆలస్యం ఎందుకని ప్రశ్నించారు. 2026-27 బడ్జెట్‌లో వికలాంగుల సంక్షేమానికి తగిన నిధులు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెన్షన్లు రద్దు చేసినట్లు ఆరోపిస్తూ, ప్రభుత్వ కార్యాలయాల్లో వికలాంగులకు అనుకూల సౌకర్యాలు లేవని పేర్కొన్నారు. విద్య, ఉపాధి అవకాశాల్లో వివక్ష కొనసాగుతోందని, వికలాంగులపై వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.

మే 29 నుంచి 31 వరకు యాదగిరిగుట్టలో ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్లీనమ్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశాలకు 33 జిల్లాల నుంచి సుమారు 500 మంది ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు.

ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్యక్షుడు కె. వెంకట్ మాట్లాడుతూ, వికలాంగుల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతోందని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్య అందించడంతో పాటు, స్వయం ఉపాధి రుణాల్లో 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలలో వికలాంగులకు అదనపు వాటా కేటాయించాలని కోరారు.

ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

వికలాంగుల పెన్షన్ రూ.6,000కు పెంచాలి: ఎన్‌పీఆర్‌డీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News