Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:25 AM

వికలాంగుల పెన్షన్ రూ.6,000 చేయాలి బడ్జెట్‌లో 5% నిధులు కేటాయించాలి… ఎన్‌పీఆర్‌డీ ధర్నా

25-02-2026 83 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి, వికలాంగుల పెన్షన్‌ను రూ.6,000కు పెంచాలని, రాష్ట్ర బడ్జెట్‌లో వికలాంగుల సంక్షేమానికి కనీసం 5 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఏవో జగన్మోహన్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సురుపంగ ప్రకాష్, ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగుల పెన్షన్‌ను రూ.6,000కు పెంచాలని డిమాండ్ చేశారు. రెండేళ్లు గడిచినా అమలు చేయకపోవడం వికలాంగుల పట్ల నిర్లక్ష్యాన్ని చూపుతోందని విమర్శించారు. వెంటనే నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

వికలాంగుల పరిరక్షణ చట్టం 2016ను కచ్చితంగా అమలు చేయాలని, సంక్షేమ పథకాలలో వికలాంగులకు ప్రాధాన్యం కల్పించాలని కోరారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఐదు శాతం నిధులు ప్రత్యేకంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంను యథావిధిగా కొనసాగించాలని, ఇతర పథకాల పేరుతో లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.

వికలాంగులకు అందిస్తున్న సహాయ పరికరాల విషయంలో నోటరీ అఫిడవిట్ నిబంధనను రద్దు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు.

ధర్నాలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లేపల్లి స్వామి, ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్, జిల్లా నాయకులు కీసర వెంకటరెడ్డి, గొడుగు దాసు నాగు, నరసింహ, పున్న శ్రీధర్, శివగల రాములు, ఏషాల గోపి, పర్వతం సాలమ్మ, గర్దాసు సత్తయ్య, యాట చందు, హరిబాబు, మంచాల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వికలాంగుల పెన్షన్ రూ.6,000 చేయాలి బడ్జెట్‌లో 5% నిధులు కేటాయించాలి… ఎన్‌పీఆర్‌డీ ధర్నా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News