Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:52 AM

వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు అధికారులకు కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాలు

09-03-2026 371 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి, మార్చి 9: రానున్న వేసవి సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తుగానే ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హాల్లో మంచి నీటి సరఫరాపై ఆర్‌డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ, హెచ్‌ఎండబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్ శాఖల అధికారులతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లన్నసాగర్ నుంచి ఘన్‌పూర్ వరకు రూ.210 కోట్లతో మంజూరైన పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

వేసవి దృష్ట్యా ముందస్తుగా యాక్షన్ ప్లాన్ రూపొందించి జిల్లావ్యాప్తంగా ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ తాగునీటి సరఫరాకు అంతరాయం తలెత్తకుండా అంకితభావంతో పనిచేయాలని తెలిపారు. నీటి సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.

త్రాగునీటి సరఫరా కోసం మిషన్ భగీరథ ద్వారా అందుబాటులో ఉన్న నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని చెప్పారు. ఏదైనా ప్రాంతంలో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు గమనించిన వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో ఉన్న చేతి పంపులు, సింగిల్ ఫేజ్ మోటర్లు, త్రీ ఫేజ్ మోటర్లు, ఓపెన్ వెల్స్ అన్నీ పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నీటి సరఫరాను మెరుగుపర్చేందుకు చేపడుతున్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని చెప్పారు. వేసవి కాలంలో ఎక్కడైనా సమస్యలు తలెత్తితే తక్షణమే స్పందించి చర్యలు తీసుకునేలా క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలని సూచించారు.

ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఎస్‌ఈ కృష్ణయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కరుణాకరన్, పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, హెచ్‌ఎండబ్ల్యూఎస్ బీజీఎం శశాంక్ తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు అధికారులకు కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News