Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:42 AM

వేసవిలో నీటిని పొదుపుగా వాడాలి: రిటైర్డ్ ఈఈ బొడ్డు సురేందర్ రావు

14-03-2026 62 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వేసవి కాలం దృష్ట్యా తాగు, సాగు నీటిని ప్రతి ఒక్కరూ పొదుపుగా వాడుకోవాలని నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఈ బొడ్డు సురేందర్ రావు సూచించారు. శనివారం మండల కేంద్రంలో స్థానిక విలేకరులతో మాట్లాడిన ఆయన, ఇటీవల వర్షాలు సమృద్ధిగా కురవడంతో భూగర్భ జలాలు పెరిగాయని, అయితే వాటిని జాగ్రత్తగా వినియోగించకపోతే మళ్లీ నీటి కొరత తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గుతున్నట్లు వార్తా కథనాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇంటి నల్లాల ద్వారా వచ్చే నీటిని వృథా చేయకుండా అవసరం ఉన్నప్పుడు మాత్రమే వినియోగించాలని, నీరు పట్టుకున్న తర్వాత నల్లలను తప్పనిసరిగా మూసివేయాలని సూచించారు.

రైతులు కూడా మోటార్లను నిరంతరం ఆన్ చేసి నీటిని వృథా చేయకుండా, పంటలకు అవసరమైనంత నీరు అందించిన తర్వాత వెంటనే మోటార్లను ఆఫ్ చేయాలని ఆయన సూచించారు. మంచినీరు కలుషితమైతే ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని, అందువల్ల నీటిని పరిశుభ్రంగా ఉంచి సురక్షితంగా వినియోగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని బొడ్డు సురేందర్ రావు తెలిపారు.

Sthanikam

వేసవిలో నీటిని పొదుపుగా వాడాలి: రిటైర్డ్ ఈఈ బొడ్డు సురేందర్ రావు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News