Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:26 AM

వేసవి శిక్షణ శిబిరమును ప్రారంభించిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

25-04-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్బీనగర్,

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వనస్థలిపురం చత్రపతి శివాజీ మైదానంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాన్ని ఎల్బీనగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి సెలవుల్లో పిల్లలు, యువతకు క్రీడలు, శారీరక దారుఢ్యం, నైపుణ్యాల అభివృద్ధికి ఇలాంటి శిబిరాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. శారీరక, మానసిక, సామాజిక వికాసానికి ఇవి దోహదపడతాయని అన్నారు. పిల్లలలో ప్రతిభ పెంపొందించడంతో పాటు సమయాన్ని సద్వినియోగం చేసుకునే అలవాటు ఏర్పడుతుందని, క్రమశిక్షణ, జట్టు భావన పెరుగుతాయని వివరించారు.

తాను హుడా చైర్మన్‌గా ఉన్న సమయంలో ఈ ప్రదేశాన్ని పార్క్‌గా కాకుండా క్రీడా మైదానంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నామని గుర్తు చేశారు. ప్రస్తుతం గాయత్రి భవన్, డీపీఎస్ మైదానం, వనస్థలిపురం ఫేజ్-4, శివాజీ మైదానం వంటి పలు ప్రదేశాలను క్రీడా మైదానాలుగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. యువతకు ఆడుకునే వేదికలు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలోని నియోజకవర్గాల్లో స్విమ్మింగ్ పూల్స్ ఉన్నప్పటికీ ఎల్బీనగర్ నియోజకవర్గంలో మూడు ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. 8 నుంచి 80 ఏళ్ల వయస్సు వారందరికీ ఉపయోగపడేలా పార్కులు, క్రీడా మైదానాలు ఏర్పాటు చేశామని తెలిపారు.

అనంతరం పలు పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో హయత్‌నగర్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ రెడ్డి, అధికారులు అశోక్, నాగేందర్, వనస్థలిపురం మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్, బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ నాయకులు కటికరెడ్డి అరవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వేసవి శిక్షణ శిబిరమును ప్రారంభించిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News