Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:35 AM

వీడ్కోలు వేడుకలో సందడి.. విద్యార్థుల కంటతడి

04-04-2026 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని శ్రీ సాయి కృప డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో డిగ్రీ 2023–2026 బ్యాచ్ విద్యార్థుల వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. కళాశాల సెమినార్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమాన్ని చైర్మన్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిగ్రీ పూర్తి చేసిన ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను కొనసాగించాలని సూచించారు. బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ కోర్సులు చేసి మంచి భవిష్యత్తు సాధించాలని కోరారు. త్వరలోనే కళాశాలలో క్యాంపస్ రిక్రూట్మెంట్ నిర్వహించి విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

విద్యార్థులు తమ మూడు సంవత్సరాల అనుభవాలను గుర్తు చేసుకుంటూ కళాశాలతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. భావోద్వేగాలతో మాట్లాడిన విద్యార్థులు కంటతడి పెట్టించారు. అనంతరం ఆటపాటలతో కార్యక్రమం సందడిగా కొనసాగింది.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ యాకుబ్ బాబా, అధ్యాపకులు శ్రావణ్ రెడ్డి, మహేందర్, మోయిన్, వీరయ్య, మరిపల్లి రాజు, సుమలత, శ్యామ్ కుమార్, రాము తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

వీడ్కోలు వేడుకలో సందడి.. విద్యార్థుల కంటతడి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News