Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:24 AM

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి

23-04-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేటలో మే 18, 19 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా 3వ మహాసభలను విజయవంతం చేయాలని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ పిలుపునిచ్చారు.

గురువారం మండల కేంద్రంలోని కూలీ వాడలో మహాసభల ప్రచార కరపత్రాన్ని సంఘం నాయకులు, వ్యవసాయ కార్మికులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నర్సింహ్మ మాట్లాడుతూ, భూమిలేని పేదలకు భూములు పంచడం, కూలీ పెంపు, కులవివక్ష నిర్మూలన లక్ష్యంగా మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య 1936లో వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించారని తెలిపారు. అప్పటి నుంచి గ్రామీణ పేదల సంక్షేమం కోసం నిరంతరం పోరాటాలు కొనసాగిస్తున్నదని చెప్పారు.

పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచాలని గ్రామాల్లో పెద్దఎత్తున సమ్మెలు నిర్వహించి సంఘం కీలక పాత్ర పోషించిందన్నారు. 2005లో ఉపాధి హామీ చట్టం అమలుకు కూడా వామపక్ష పార్టీలతో కలిసి పోరాటాలు చేసినట్లు వివరించారు.

రాష్ట్ర కమిటీ సభ్యులు జెల్లెల పెంటయ్య మాట్లాడుతూ, మహాసభల సందర్భంగా గ్రామాల వారీగా ప్రచార జాతాలు నిర్వహించి, మే 18న భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 300 మంది ప్రతినిధులతో మహాసభలు జరగనున్నాయని చెప్పారు.

ఈ బహిరంగ సభకు ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు, ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యండి జహంగీర్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మేడి ముకుందం, కార్యదర్శి కందుల హనుమంతు, సీఐటీయూ మండల కార్యదర్శి గొరిగె సోములు, నాయకులు గాదె నరేందర్, మేడి అంజమ్మ, మమత, చంద్రమ్మ, రాములమ్మ, గాదె పద్మ, గోర్ల అండాలు, జాన్సీ, బందెల ముత్యాలి, గట్టు అనిత తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News