Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:31 AM

వాటర్ ప్లాంట్ పునరుద్ధరణకు డిమాండ్ మంచినీటి కోసం ప్రజల ఇబ్బందులు.. సీపీఐ(ఎం) ఆందోళన

16-04-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: పట్టణంలోని 9వ వార్డు సింగనగూడంలో ఉన్న వాటర్ ప్లాంట్‌ను తక్షణమే పునరుద్ధరించాలని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ డిమాండ్ చేశారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడారు.

సుమారు 10 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ వాటర్ ప్లాంట్ గత రెండు మూడు సంవత్సరాలుగా రిపేర్లు చేయకపోవడం, కరెంట్ బిల్లులు చెల్లించకపోవడం వల్ల మూతపడిందని తెలిపారు. దీంతో స్థానిక ప్రజలు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ప్రజలు బైపాస్ రోడ్డు దాటి నీరు తెచ్చుకునే పరిస్థితి ఉందని, ఇది ప్రమాదకరమని పేర్కొన్నారు. వెంటనే వాటర్ ప్లాంట్‌ను పునఃప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పట్టణ సెక్రటేరియట్ సభ్యులు గంధ మల్ల మాతయ్య, చింతల శివ, మన్నె రమేష్, మన్నె రాజు, చింతల ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వాటర్ ప్లాంట్ పునరుద్ధరణకు డిమాండ్ మంచినీటి కోసం ప్రజల ఇబ్బందులు.. సీపీఐ(ఎం) ఆందోళన

Article Image

భువనగిరి: పట్టణంలోని 9వ వార్డు సింగనగూడంలో ఉన్న వాటర్ ప్లాంట్‌ను తక్షణమే పునరుద్ధరించాలని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ డిమాండ్ చేశారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడారు.

సుమారు 10 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ వాటర్ ప్లాంట్ గత రెండు మూడు సంవత్సరాలుగా రిపేర్లు చేయకపోవడం, కరెంట్ బిల్లులు చెల్లించకపోవడం వల్ల మూతపడిందని తెలిపారు. దీంతో స్థానిక ప్రజలు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ప్రజలు బైపాస్ రోడ్డు దాటి నీరు తెచ్చుకునే పరిస్థితి ఉందని, ఇది ప్రమాదకరమని పేర్కొన్నారు. వెంటనే వాటర్ ప్లాంట్‌ను పునఃప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పట్టణ సెక్రటేరియట్ సభ్యులు గంధ మల్ల మాతయ్య, చింతల శివ, మన్నె రమేష్, మన్నె రాజు, చింతల ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News