Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:12 PM

వాడి పడేసిన థర్మాకోల్ పెట్టెతో మెడలు విరిగిన కుక్కపిల్లకి వైద్యం

27-02-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

వినూత్న వైద్యంతో కుక్కపిల్లకి ప్రాణం పోసిన కోదాడ ప్రాంతీయ పశువైద్యశాల

కోదాడ మండలం దొరకుంట గ్రామములో తన ఇంటిముందు ఉన్న నెలరోజుల కుక్కపిల్ల తలపైనుండి బైక్ పోవడం తో మెడ ఎముకలు విరిగి నోటి నుండి రక్తం కారి ఒంట్లో రక్తం లేక ఒళ్లు బిగదీసుకొని పోయింది . అచేతన స్థితిలో పడిపోయిన కుక్కపిల్లని ఆ ఇంటి యజమాని నిన్న హుటాహుటిన కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలకి తీసుకు వచ్చారు. కుక్కను పరీక్షించిన అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య ఇతర కుక్కల రక్తం ఎక్కించి, గ్లూకోజ్ లు ఇతర అత్యవసర మందులతో వైద్యం చేసి కుక్కపిల్ల తిరిగి స్పృహలో కొచ్చేలా చేశారు. కానీ మెడ ఎముకలు విరగడం వెన్నెముక నరాలు సైతం కొంత దెబ్బతినడం తో కుక్కపిల్ల రాత్రి నుండి నిలబడలేక, పడుకోబెడితే నొప్పికి తట్టుకోలేక మెడలు వంకరపోతూ అంత్యంత నరకయాతన అనుభవిస్తుండడంతో తిరిగి ఈరోజు కోదాడ దవాఖానకి తీసుకు వచ్చారు.

కుక్క పిల్ల దీనావస్థను పరిశీలించిన అసిస్టెంట్ డైరెక్టర్ నిపుణుల సలహాతో మనుషుల్లో వాడే “సర్వైకల్ స్పైకా కాస్ట్ “ పద్ధతి ఉపయోగించి మాడు నుండి నడుం వరకు బాడీ అంతా సిమెంట్ కట్టు వేసి కాళ్ళు కదిలేలా వసతి ఏర్పాటు చేశారు.

అంతరం సిమెంట్ కట్టు బరువు మోస్తూ కుక్కపిల్ల పడిపోకుండా నిలబడేలా వినూత్నంగా ఆలోచించి వ్యాక్సిన్ నిల్వచేసే ధర్మకాల్ పెట్టే పైమూతకి నాలుగు కాళ్ళు కిందకు దిగేలా రంధ్రాలు చేసి మూతపై కుక్కపిల్లను నిల్చోబెట్టి దాని బాదకు విముక్తి కలిగించారు.

ఏ అసౌకర్యం లేకున్నా పరికరాలు లేకున్నా వాడి పడేసిన ధర్మకాల్ పెట్టెతో కుక్కను నిల్చోపెట్టిన అసిస్టెంట్ డైరెక్టర్ సమయస్ఫూర్తికి జంతు యజమానులు అబ్బురపడ్డారు

చికిత్సలో సిబ్బంది చంద్రకళ కర్ణ పాల్గొన్నారు.

Sthanikam

వాడి పడేసిన థర్మాకోల్ పెట్టెతో మెడలు విరిగిన కుక్కపిల్లకి వైద్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News