Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:49 PM

వడ్ల కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి

11-04-2026 83 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: వరి కోతలు ప్రారంభమై 15 రోజులు గడిచినా ఇప్పటివరకు వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంపై సిపిఐ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతుల నుంచి వడ్ల కొనుగోలు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు.

కొనుగోలు కేంద్రాలు కేవలం 45 రోజులపాటు మాత్రమే కొనసాగుతాయని, వర్షాకాలం ప్రారంభానికి ముందే మార్కెట్‌కు వచ్చిన వడ్లన్నీ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

మార్కెట్లకు సరిపడా భర్దాన్ సంచులు పంపించడంతో పాటు, తరుగుడు పేరుతో రైస్ మిల్లర్లు రైతులకు ఇబ్బందులు కలిగించవద్దని హెచ్చరించారు. గ్రేడ్-1, గ్రేడ్-2 వడ్లను సక్రమంగా పరిశీలించి కొనుగోలు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరు నరసింహ, ఎర్ర రమేష్ గౌడ్, రచ్చ యాదగిరి, గంగాపురం యాదయ్య, ఊట్కూరు భగవంత, వీరమల్ల వెంకటయ్య, ఊట్కూరు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వడ్ల కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి

Article Image

రామన్నపేట: వరి కోతలు ప్రారంభమై 15 రోజులు గడిచినా ఇప్పటివరకు వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంపై సిపిఐ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతుల నుంచి వడ్ల కొనుగోలు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు.

కొనుగోలు కేంద్రాలు కేవలం 45 రోజులపాటు మాత్రమే కొనసాగుతాయని, వర్షాకాలం ప్రారంభానికి ముందే మార్కెట్‌కు వచ్చిన వడ్లన్నీ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

మార్కెట్లకు సరిపడా భర్దాన్ సంచులు పంపించడంతో పాటు, తరుగుడు పేరుతో రైస్ మిల్లర్లు రైతులకు ఇబ్బందులు కలిగించవద్దని హెచ్చరించారు. గ్రేడ్-1, గ్రేడ్-2 వడ్లను సక్రమంగా పరిశీలించి కొనుగోలు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరు నరసింహ, ఎర్ర రమేష్ గౌడ్, రచ్చ యాదగిరి, గంగాపురం యాదయ్య, ఊట్కూరు భగవంత, వీరమల్ల వెంకటయ్య, ఊట్కూరు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News