Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:31 AM

వడ్ల కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి. రైతులపై రాజకీయాలు తగవు : కునూరి సాయికుమార్ గౌడ్

17-05-2026 141 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం సహా అన్ని గ్రామాల్లో వడ్ల కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని బోగారం సర్పంచ్, కునూరి సాయికుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

మండల వ్యాప్తంగా రైతులు సుమారు 13 లక్షలకుపైగా వడ్ల బస్తాలు పండిస్తే ఇప్పటి వరకు 20 శాతం కూడా కొనుగోలు జరగలేదన్నారు. రైతులు అప్పులు చేసి పంట పండిస్తే ధాన్యం కొనుగోలు కోసం రోజుల తరబడి అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.తరలించిన ధాన్యం రోజులు గడిచినా దిగుమతి కాక రైతులు, లారీ డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఇంద్రపాలనగరంలో 70 మంది రైతులు ప్రభుత్వం సూచించిన స్థలంలోనే వడ్లు పోశారని, కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్రారంభించి రైతులను రాజకీయాలకు అతీతంగా చూడాలని కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే రైతులతో కలిసి ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు.

Sthanikam

వడ్ల కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి. రైతులపై రాజకీయాలు తగవు : కునూరి సాయికుమార్ గౌడ్

Article Image

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం సహా అన్ని గ్రామాల్లో వడ్ల కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని బోగారం సర్పంచ్, కునూరి సాయికుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

మండల వ్యాప్తంగా రైతులు సుమారు 13 లక్షలకుపైగా వడ్ల బస్తాలు పండిస్తే ఇప్పటి వరకు 20 శాతం కూడా కొనుగోలు జరగలేదన్నారు. రైతులు అప్పులు చేసి పంట పండిస్తే ధాన్యం కొనుగోలు కోసం రోజుల తరబడి అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.తరలించిన ధాన్యం రోజులు గడిచినా దిగుమతి కాక రైతులు, లారీ డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఇంద్రపాలనగరంలో 70 మంది రైతులు ప్రభుత్వం సూచించిన స్థలంలోనే వడ్లు పోశారని, కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్రారంభించి రైతులను రాజకీయాలకు అతీతంగా చూడాలని కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే రైతులతో కలిసి ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News