Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ లో ట్రాఫిక్ సమస్యల నివారణ కు ఆపరేషన్ రోప్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 08:01 AM

వడ్డెరుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది..

వడ్డెరుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది..

వడ్డెరుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది..
April 21, 2026 06:39 PM 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

నామినేటెడ్ పదవుల్లో సముచిత ప్రాధాన్యత ఇస్తాం..

పెండింగ్ బిల్లులు ఇప్పటికే విడుదల చేశాం..

రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి..


నల్లగొండ : నిరంతరం కష్టపడి పని చేసే వడ్డెర సోదరుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెన్నార్ గార్డెన్స్‌లో నిర్వహించిన అఖిలభారత వడ్డెర సంక్షేమ సంఘం సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ జగద్గురు ఇమ్మడి సిద్ధ రామేశ్వర స్వామి సమక్షంలో జరిగిన ఈ సభలో మంత్రి వడ్డెర సామాజిక వర్గానికి పలు కీలక హామీలు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డెరులకు సంబంధించిన పెండింగ్ బిల్లులన్నింటినీ విడుదల చేశామని గుర్తు చేశారు. వచ్చే నెలలో భర్తీ చేయనున్న నామినేటెడ్ పదవుల్లో వడ్డెరులకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. వడ్డెరుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే బాధ్యతను తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు. నల్లగొండ పట్టణంలో నిర్మాణ దశలో ఉన్న వడ్డెర సంఘం భవనాన్ని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని మంత్రి ప్రకటించారు.

సంఘం అధ్యక్షులు అలకుంట్ల నాగరత్నం రాజు అధ్యక్షతన జరిగిన ఈ సభలో వడ్డెర సామాజిక వర్గ ప్రతినిధులు భారీగా పాల్గొన్నారు. ఎమ్మెన్నార్ గార్డెన్స్ జనసందోహంతో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, ఎంబీసీ చైర్మన్ జరిపేటి జైపాల్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ గోగుల సరిత, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు మంజుల రమేష్, జాతీయ ప్రధాన కార్యదర్శి గుంజ శ్రీనివాస్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంటిపుల్లి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు గుంజ వెంకట్ నారాయణ, జిల్లా అధ్యక్షులు వేముల సుధాకర్, కార్పొరేటర్లు ఆలకుంట్ల ఝాన్సీరాణి, ఆలకుంట్ల నాగరాజుతో పాటు యాదాద్రి జిల్లా అధ్యక్షులు గుర్రం కుమారస్వామి, పల్లపు దుర్గయ్య, పల్లపు నారాయణ, రవి తదితరులు పాల్గొని వడ్డెర సామాజిక వర్గ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రసంగించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News