Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:54 PM

ఉపాధి కూలీల బకాయిలు వెంటనే చెల్లించాలి. జల్లెల పెంటయ్య.

09-04-2026 68 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉపాధి హామీ కూలీలకు పెండింగ్‌లో ఉన్న కూలీ డబ్బులను తక్షణమే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జల్లెల పెంటయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సిరిపురం గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశాన్ని సందర్శించి కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే దిశగా చర్యలు తీసుకుంటోందని విమర్శించారు. రాష్ట్రంపై నిధుల భారం మోపుతూ తగిన కేటాయింపులు చేయడం లేదని ఆరోపించారు. సిరిపురం గ్రామంలో కూలీలు గత మూడు నెలలుగా పనిచేసిన కూలీ డబ్బులు అందలేదని, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో పనిచేయాల్సి వస్తోందని తెలిపారు.

ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఒంటిపూట పని విధానం అమలు చేయాలని, పని ప్రదేశాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలపై స్థానిక ఏపీవోకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

అనంతరం గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా కూనూరు సుష్మ, కార్యదర్శిగా గాదె లావణ్యను ఎంపిక చేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, సంఘం జిల్లా నాయకులు బలుగూరి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉపాధి కూలీల బకాయిలు వెంటనే చెల్లించాలి. జల్లెల పెంటయ్య.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News