Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:10 PM

ఉపాధి కూలీ రూ.800 చేయాలి.. ఈ-కేవైసీ రద్దు చేయాలి. నరసింహ

22-04-2026 136 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ: పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉపాధి హామీ కార్మికులకు రోజుకు రూ.800 కూలీ చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ ప్రభుత్వం‌ను డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పనులకు అడ్డంకిగా మారుతున్న ఈ-కేవైసీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు.

మోటకొండూర్ మండలంలోని ఆరెగూడెం గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కూలీలకు రోజువారీ కూలీ ఎంతనో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. వారానికి ఒకసారి పే స్లిప్పులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రూ.150 నుంచి రూ.200 మాత్రమే ఇస్తున్నారని కార్మికులు చెబుతున్నారని, ప్రభుత్వం నిర్ణయించిన కనీస కూలీ అయినా పూర్తిగా చెల్లించాలని ప్రశ్నించారు.

ఈ-కేవైసీ కారణంగా అనేక మంది కార్మికులు పనులకు దూరమవుతున్నారని, దాన్ని వెంటనే రద్దు చేయాలని ఆయన కోరారు. పని ప్రదేశాల్లో మౌలిక వసతులు కల్పించడం, ప్రమాద బీమా సదుపాయం అమలు చేయాలని సూచించారు.

కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొలగాని జయరాములు మాట్లాడుతూ, సాగునీరు లేక ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో కనీసం 200 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. భూమిలేని పేదలకు రూ.12 వేల ఆర్థిక సహాయం హామీని అమలు చేయాలని కోరారు.

కార్యక్రమంలో సంఘం మండల నాయకులు కొల్లూరు ఆంజనేయులు, టెక్నికల్ అసిస్టెంట్ ఏ. మంగ, మేటు హరిబాబు, కొల్లూరి శ్రీహరి, సుధాకర్, రమేష్, నాగరాజ్, గాదుల శ్రీను, సత్యలక్ష్మి, జ్యోతి, అశ్విని, గణేష్, పద్మ, రజిని, సరిత, దివ్య, మల్లేష్, జహంగీర్, మల్లయ్య, నరసింహులు, బాల నరసింహ, మానస, లక్ష్మి, అఖిల, భాగ్యలక్ష్మి, బాలమణి, లింగమ్మ, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉపాధి కూలీ రూ.800 చేయాలి.. ఈ-కేవైసీ రద్దు చేయాలి. నరసింహ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News