Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:26 AM

ఉపాధి కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్న మోడీ ప్రభుత్వం: నర్సింహ

24-04-2026 106 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆత్మకూరు: గ్రామీణ ప్రాంతాల్లో సంపద సృష్టిస్తున్న ఉపాధి హామీ కార్మికులను పనుల నుంచి దూరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ ఆరోపించారు. ఉపాధి పని ప్రదేశాల్లో మౌలిక వసతులు కల్పించి కార్మికులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

శుక్రవారం మండలంలోని కూరెళ్ల గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఉపాధి కూలీలు కేవలం పనులు చేయడం మాత్రమే కాకుండా చెరువుల పూడికతీత, గట్లు, రహదారులు, కాలువలు నిర్మాణం, మొక్కలు నాటడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారని తెలిపారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరచే చర్యలు జరుగుతున్నాయని విమర్శించారు. పాత చట్టాన్ని కొనసాగించి ఈ-కేవైసీ విధానాన్ని రద్దు చేయాలని కోరారు.

పని ప్రదేశాల్లో తాగునీరు, మెడికల్ కిట్లు లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. సంవత్సరానికి 200 రోజుల పని కల్పించి, రోజుకు రూ.800 కూలీ ఇవ్వాలని, ప్రమాదంలో మరణిస్తే రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడితే పూర్తి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ డిమాండ్ల సాధన కోసం మే 4న కూరెళ్ల గ్రామంలో నిర్వహించే మండల స్థాయి సదస్సును విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు వేముల భిక్షం, మండల కన్వీనర్ తుమ్మలగూడెం యాదయ్య, ఉపసర్పంచ్ హనుమంతుల రమేష్, గ్రామ నాయకులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, కార్మికులు పాల్గొన్నారు.

Sthanikam

ఉపాధి కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్న మోడీ ప్రభుత్వం: నర్సింహ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News