Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:31 AM

ఉపాధి హామీ పథకంలో ప్రతిభ చూపిన ఫీల్డ్ అసిస్టెంట్లకు సత్కారం. అదనపు కలెక్టర్

16-04-2026 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) అమలులో విశేష ప్రతిభ కనబర్చిన క్షేత్ర సహాయకులను జిల్లా స్థాయిలో ఘనంగా సత్కరించారు. గురువారం డీఆర్‌డీఏ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నగదు బహుమతులతో పాటు ప్రశంసాపత్రాలు అందజేశారు.

జిల్లాలోని పలు గ్రామపంచాయతీలలో అధిక సంఖ్యలో పనివారిని సమీకరించి, పనులను సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా, NMMS యాప్ ద్వారా ఆన్‌లైన్ హాజరు నమోదు చేసి పారదర్శకత, బాధ్యతాయుతత పెంచిన ఫీల్డ్ అసిస్టెంట్లు ఆదర్శంగా నిలిచారు.

నారాయణపూర్, తుర్కపల్లి, గుండాల, రాజపేట, చౌటుప్పల్, ఆలేరు, భువనగిరి మండలాలకు చెందిన గంటా నర్సింహ, ఉడుగు వెంకటేష్, గడిపే ఇంద్రయ్య, వి. మల్లేష్, గుందేబోయిన సుజాత, బి. శ్రీను, షేక్ హుస్సేన్, పాలడుగు యాదయ్య, కె. గోపాల్, ఎండి సోనీ, దుబ్బాక నర్సింహ, ఉడుగుల శ్రీనివాస్, నర్సింహ బొల్లేపల్లి లను ప్రతిఒక్కరికి రూ.1000 నగదు బహుమతి అందజేసి సత్కరించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ, సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తూ గ్రామీణ అభివృద్ధికి తోడ్పడుతున్న ఫీల్డ్ అసిస్టెంట్లు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. వారి కృషి వల్ల ఉపాధి హామీ పథకం మరింత బలోపేతం అవుతుందని అభినందించారు.

డీఆర్‌డీఏ పీడీ నాగిరెడ్డి మాట్లాడుతూ, క్షేత్ర స్థాయిలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లే పథకం విజయానికి ప్రధాన బలం అని పేర్కొన్నారు. ఎక్కువ మంది కార్మికులతో పనులు నిర్వహించడం మాత్రమే కాకుండా, NMMS యాప్ ద్వారా హాజరు నమోదు చేయడం ద్వారా పారదర్శకతను పెంచుతున్నారని చెప్పారు.

ఈ కార్యక్రమంలో అదనపు డీఆర్‌డీఏ అధికారి సురేష్, అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ మందడి ఉపేందర్ రెడ్డి, ఏపీడీ నవీన్ కుమార్ తదితరులు పాల్గొని విజేతలను అభినందించారు.

Sthanikam

ఉపాధి హామీ పథకంలో ప్రతిభ చూపిన ఫీల్డ్ అసిస్టెంట్లకు సత్కారం. అదనపు కలెక్టర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News