Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:27 AM

ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: జేఏసీ

17-04-2026 132 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ డిమాండ్ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు.

రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అనేక సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని, అయితే ఇంకా పలు న్యాయబద్ధ డిమాండ్లు అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆశించిన స్పందన రాలేదని తెలిపారు.

ఈ నేపథ్యంలో పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించి, న్యాయబద్ధ డిమాండ్లను అమలు చేయాలని ఆర్డీఓ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

జేఏసీ ప్రధాన డిమాండ్లు: జూన్ 2 నాటికి పీఆర్సీ అమలు, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపు, హెల్త్ కార్డుల అమలు, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణ, పెండింగ్ డీఏల విడుదల, వీఆర్ఏల సమస్యల పరిష్కారం, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత, సాధారణ బదిలీలు చేపట్టడం తదితరాలు ఉన్నాయి.

కార్యక్రమంలో జేఏసీ నాయకులు పి. రాధ, ఆర్. ఉమా, కె. శ్రీధర్, పి. ఇందుమతి, వనం వెంకటేశ్వర్లు, పి. రవికుమార్, లోకేందర్ రెడ్డి, సైదా సాహెబ్, కల్యాణ్, ప్రణయ్, గుర్రాల బాలకృష్ణ, కె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: జేఏసీ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News