Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:10 PM

ఉద్యమకారులకు న్యాయం చేయాలి. జోగు అంజన్న

ఉద్యమకారులకు న్యాయం చేయాలి. జోగు అంజన్న

ఉద్యమకారులకు న్యాయం చేయాలి. జోగు అంజన్న
22-04-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ: రాష్ట్రంలో ఉద్యమకారులను గుర్తించి వారికి న్యాయం చేసే దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాసరావు నాయకత్వంలో పలుమార్లు ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లినప్పటికీ ఇంకా పరిష్కారం కాలేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో తొలి, మలిదశల్లో పాల్గొని జైలు శిక్షలు అనుభవించినవారు, కేసులు ఎదుర్కొన్నవారు, గాయాల పాలైనవారికి సరైన గుర్తింపు, సహాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్, లాఠీ దాడులను ఎదుర్కొని పోరాడిన ఉద్యమకారుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఉద్యమకారులను గుర్తించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని సూచించారు.

అర్హులైన ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, కుటుంబాలను ఆదుకోవాలని, నిరుద్యోగులుగా మిగిలిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మరుగునపడిన ఉద్యమ నాయకులను గుర్తించి సత్కరించాలని కోరారు.

ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేసి ఉద్యమకారులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.

Sthanikam

ఉద్యమకారులకు న్యాయం చేయాలి. జోగు అంజన్న

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News