Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:41 AM

ఉద్యమకారుడు శ్రవణ్ మృతి.. కుటుంబానికి ప్రభుత్వం సాయం చేయాలి. జోగు అంజన్న

09-04-2026 60 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: తెలంగాణ ఉద్యమకారుడు దాసిరెడ్డి శ్రవణ్ కుమార్ రెడ్డి మృతి ఉద్యమకారులకు తీరని లోటని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న పేర్కొన్నారు. గురువారం పత్రికా ప్రకటనలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

సిరిపురం గ్రామానికి చెందిన శ్రవణ్ కుమార్ రెడ్డి వయస్సు 40 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని గ్రామ స్థాయిలో సారథ్యం వహించారని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ పిలుపులను అనుసరించి పోరాడిన ఆయన, మలిదశ ఉద్యమంలో ఆర్థికంగా నష్టపోయి జైలు జీవితం గడిపినట్లు చెప్పారు.

తెలంగాణ ఏర్పాటుతో ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆశించిన నిరుద్యోగిగా ఆయన నిరాశ చెందారని పేర్కొన్నారు. గుండెపోటుతో సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎనిమిది రోజుల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశారని తెలిపారు.

శ్రవణ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారంపై సబ్ కమిటీ ఆలస్యం చేయకుండా తక్షణ నిర్ణయం తీసుకోవాలని కోరారు.

Sthanikam

ఉద్యమకారుడు శ్రవణ్ మృతి.. కుటుంబానికి ప్రభుత్వం సాయం చేయాలి. జోగు అంజన్న

Article Image

రామన్నపేట: తెలంగాణ ఉద్యమకారుడు దాసిరెడ్డి శ్రవణ్ కుమార్ రెడ్డి మృతి ఉద్యమకారులకు తీరని లోటని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న పేర్కొన్నారు. గురువారం పత్రికా ప్రకటనలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

సిరిపురం గ్రామానికి చెందిన శ్రవణ్ కుమార్ రెడ్డి వయస్సు 40 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని గ్రామ స్థాయిలో సారథ్యం వహించారని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ పిలుపులను అనుసరించి పోరాడిన ఆయన, మలిదశ ఉద్యమంలో ఆర్థికంగా నష్టపోయి జైలు జీవితం గడిపినట్లు చెప్పారు.

తెలంగాణ ఏర్పాటుతో ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆశించిన నిరుద్యోగిగా ఆయన నిరాశ చెందారని పేర్కొన్నారు. గుండెపోటుతో సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎనిమిది రోజుల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశారని తెలిపారు.

శ్రవణ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారంపై సబ్ కమిటీ ఆలస్యం చేయకుండా తక్షణ నిర్ణయం తీసుకోవాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News