Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:02 PM

తిరగలపడి బయటకు వచ్చిన మేక గర్భాశం

తిరగలపడి బయటకు వచ్చిన మేక గర్భాశం

తిరగలపడి బయటకు వచ్చిన మేక గర్భాశం
30-01-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

తిరగలపడి బయటకు వచ్చిన మేక గర్భాశం

యదాస్థానికి చేర్చి కుట్లు వేసి వైద్యంతో మేకను రక్షించిన అసిస్టెంట్ డైరెక్టర్

గత ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో మేకల్లో నమోదైన తొలికేసు

కోదాడ పట్టణం రైతు మటన్ సెంటర్ నిర్వాహకులు కొత్తగా కొనుగోలు చేసే జీవాలకు దారి చూపడానికి గత నాలుగు సంవత్సరాలుగా ఒక మేకను పెంచుకుంటున్నారు. అది ఈమధ్య పిల్లలు పెట్టాక రెండు రోజుల క్రితం గర్భాశం తిరగలపడి గుడ్లమాయతో సహా బైటకు వచ్చి రక్తం కారుతూ బైటకు వేలాడుతుంది. పని వత్తిడిలో ఉన్న యజమానులు గమనించుకోకపోవడం తో కారిన రక్తం, మట్టి చెత్త పట్టి గర్భాశయం వాడిపోయింది. శుక్రవారం ఉదయం గమనించిన యజమాని హుటాహుటిన కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలకు తరలించారు.

మేకను పరిశీలించిన అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య,యాంటి సెప్టిక్ ద్రావణంతో బైటకు వేలాడుతున్న గర్భాశయాన్ని శుభ్రపరచి, వెన్నెముక మత్తు ఇచ్చి గర్భాశం చిరిగి పోకుండా జాగ్రత్తగా కడుపులోకి అమర్చి తిరిగి బైటకు రాకుండా కుట్లు వేసి తదుపరి వైద్యం అందించి మేక ప్రాణాలను కాపాడారు.ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ్య మాట్లాడుతూ.. గర్భాశయం బైటకు రావడం గేదెలు ఆవుల్లో సాధారణం కానీ మేకల్లో ఇలా రావడం అత్యంత అరుదని, ఉద్యోగంలో చేరిన నాటి నుండి నేటి వరకు 28 సంవత్సరాల్లో ఇంతవరకూ మేకల్లో ఇలాంటి కేసు రావడం ఇదే తొలిసారి అని చెప్పారు.గర్భాశయ కండరాల బలహీనత, కాల్షియం పాస్పరస్ మూలకాల లోపం , హార్మోన్ లు విటమిన్ లోపాల వలన ఇలా జరుగుతుందని అన్నారు.చికిత్స అనంతరం మేక చురుకుగా నడుస్తూ ఇంటికి వెళ్ళడంతో యజమాని ఊపిరి పీల్చుకున్నారు.

చికిత్సలో సిబ్బంది చంద్రకళ,కర్ణ పాల్గొన్నారు.

Sthanikam

తిరగలపడి బయటకు వచ్చిన మేక గర్భాశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News