Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:25 AM

తల్లిదండ్రులతో సమావేశాలు.. విద్యార్థుల ప్రగతికి దోహదం. అదనపు కలెక్టర్

23-04-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి

తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు సమావేశాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల విద్యా ప్రగతి, ప్రవర్తన, హాజరు, ప్రతిభ వంటి అంశాలపై సమగ్రంగా చర్చించవచ్చని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు తెలిపారు.

గురువారం 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా భువనగిరిలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తల్లిదండ్రులతో సమావేశాల ద్వారా విద్యార్థుల బలాలు, బలహీనతలను గుర్తించి మెరుగుదలకు తగిన సూచనలు ఇవ్వవచ్చన్నారు.

తల్లిదండ్రులు తమ పిల్లల అభ్యాసంపై ఉపాధ్యాయులతో నేరుగా మాట్లాడే అవకాశం ఉండడం వల్ల సమస్యలను త్వరగా గుర్తించి పరిష్కరించవచ్చన్నారు. అలాగే ఉపాధ్యాయులు కూడా తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకుని బోధన విధానాల్లో అవసరమైన మార్పులు చేయగలరని పేర్కొన్నారు. ఈ పరస్పర సంబంధం విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి చదువుపై ఆసక్తిని పెంచుతుందని చెప్పారు.

ఈ సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థుల తల్లిదండ్రులను సన్మానించి, విద్యార్థులకు ప్రగతి నివేదికలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు..

Sthanikam

తల్లిదండ్రులతో సమావేశాలు.. విద్యార్థుల ప్రగతికి దోహదం. అదనపు కలెక్టర్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News