Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:17 PM

తాళ్లసింగారంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం

15-04-2026 115 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డు తాళ్లసింగారం గ్రామంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ తెలిపారు. బుధవారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 100 KV విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆమె ప్రారంభించారు.​మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ఈ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. దీనివల్ల గ్రామంలో విద్యుత్ సరఫరా మెరుగుపడుతుందని, లో-ఓల్టేజీ సమస్య తప్పుతుందని వివరించారు. ప్రజల అవసరాలను గుర్తించి ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.​ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సుర్వి నర్సింహా గౌడ్, విద్యుత్ శాఖ ఏఈ సతీష్ కుమార్, కౌన్సిలర్ కొసనం రాకేష్ రెడ్డి, నాయకులు భాస్కర్ రెడ్డి, దొనకొండ కృష్ణ, శ్రీశైలం, గణేష్, గ్రామ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

తాళ్లసింగారంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News