Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:27 AM

తై-బజార్‌పై అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి: గుమిడెల్లి రమేష్

24-04-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: తై-బజార్ టెండర్‌పై అసత్య ప్రచారాలు నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుమిడెల్లి రమేష్ సూచించారు. టెండర్ దక్కకపోవడంతో అక్కసుతోనే కొందరు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, మున్సిపల్ అధికారులు ప్రతి ఏడాది నోటిఫికేషన్ జారీ చేసి పారదర్శకంగా టెండర్ ప్రక్రియ నిర్వహిస్తారని తెలిపారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా కొందరు స్వార్థ రాజకీయ నాయకుల మద్దతుతో సిండికేట్లు ఏర్పడి మున్సిపల్ ఆదాయానికి నష్టం కలిగించారని ఆరోపించారు.

గత ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.8.70 లక్షలకు టెండర్ పొందగా, ఈసారి రూ.12 లక్షలకు టెండర్ దక్కిందని తెలిపారు. మున్సిపాలిటీకి ఆదాయం పెంచిన కొత్త యాజమాన్యంపై అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు.

తై-బజార్‌లో పనిచేసే సిబ్బందిని బెదిరించడం, పనికి అడ్డంకులు కల్పించడం జరుగుతోందని ఆరోపించారు. అవినీతి, అక్రమాలపై బహిరంగ విచారణకు సిద్ధమని స్పష్టం చేశారు.

Sthanikam

తై-బజార్‌పై అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి: గుమిడెల్లి రమేష్

Article Image

భువనగిరి: తై-బజార్ టెండర్‌పై అసత్య ప్రచారాలు నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుమిడెల్లి రమేష్ సూచించారు. టెండర్ దక్కకపోవడంతో అక్కసుతోనే కొందరు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, మున్సిపల్ అధికారులు ప్రతి ఏడాది నోటిఫికేషన్ జారీ చేసి పారదర్శకంగా టెండర్ ప్రక్రియ నిర్వహిస్తారని తెలిపారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా కొందరు స్వార్థ రాజకీయ నాయకుల మద్దతుతో సిండికేట్లు ఏర్పడి మున్సిపల్ ఆదాయానికి నష్టం కలిగించారని ఆరోపించారు.

గత ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.8.70 లక్షలకు టెండర్ పొందగా, ఈసారి రూ.12 లక్షలకు టెండర్ దక్కిందని తెలిపారు. మున్సిపాలిటీకి ఆదాయం పెంచిన కొత్త యాజమాన్యంపై అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు.

తై-బజార్‌లో పనిచేసే సిబ్బందిని బెదిరించడం, పనికి అడ్డంకులు కల్పించడం జరుగుతోందని ఆరోపించారు. అవినీతి, అక్రమాలపై బహిరంగ విచారణకు సిద్ధమని స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News