Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నియోజకవర్గ సమస్యల పరిష్కారమే లక్ష్యం – ముఖ్యమంత్రిని కలిసిన ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 31, 2026 01:02 AM

టీయూడబ్ల్యుజే ఐ జే యు సభ్యత్వానికి జిల్లాలో ఊహించని విశేష స్పందన

టీయూడబ్ల్యుజే ఐ జే యు సభ్యత్వానికి జిల్లాలో ఊహించని విశేష స్పందన

టీయూడబ్ల్యుజే ఐ జే యు సభ్యత్వానికి జిల్లాలో ఊహించని విశేష స్పందన
May 29, 2026 05:06 PM 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist


- జర్నలిస్టులకు వృత్తి భద్రత, విలువల నిబద్ధత టీయూడబ్ల్యూజే ఐజేయుతోనే సాధ్యం

- టీయూడబ్ల్యూజే ఐజేయు సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు డాక్టర్ కృష్ణ బంటు


మీడియా రంగంలోని 99 శాతం జర్నలిస్టులకు వృత్తి భద్రత కల్పిస్తూ జర్నలిజం విలువలను పరిరక్షించడంలో టీయూడబ్ల్యూజే ఐజేయు అగ్ర భాగాన ఉంటుందని టి యు డబ్ల్యూ జే ఐజేయు సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు డాక్టర్ కృష్ణ బంటు చెప్పారు. ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు కొణిజేటి సత్యనారాయణ, టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు చలసాని శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లాలో గత రెండు వారాలుగా ముమ్మరంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం లో భాగంగా శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పలువురు జర్నలిస్టులకు సభ్యత్వం ఇచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలను పరిష్కరించడంలో టీయూడబ్ల్యూజే ఐజేయు ముందుంటుందని స్పష్టం చేశారు. జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా యూనియన్ జాతీయ, రాష్ట్ర నాయకత్వం అహర్నిశలు కృషి చేస్తుందని వెల్లడించారు. జర్నలిస్టులకు మొట్టమొదటి సారిగా అక్రిడిటేషన్, బస్సు పాస్ సౌకర్యం కల్పించిన ఘనత టీయూడబ్ల్యూజే ఐజేయుది అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా 33 జిల్లాలలో మెజార్టీ అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు తమ యూనియన్ పక్షాన ఉన్నారని, వారందరూ కూడా అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రిడిటేషన్లు అందాలనే ఉద్దేశంతో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇప్పించడమే కాకుండా వృత్తిలో నైపుణ్యం పెంపొందించుకోవడానికి శిక్షణ కార్యక్రమాలు చేపట్టిన ఘనత కూడా టీయూడబ్ల్యూజే ఐజేయు దే అనే వెల్లడించారు. జర్నలిస్టులు అందరూ కూడా తమకు అవసరమైన అండగా ఉండే సంఘమేదో గుర్తుంచుకొని టీయూడబ్ల్యూజే ఐజేయులు సభ్యులుగా చేరుతున్నారని చెప్పారు. ఒక శాతం జర్నలిస్టులకు కూడా ప్రాతినిధ్య వహించని కొన్ని గుర్తింపు లేని సంఘాలు, జర్నలిస్టుల నమ్మకాన్ని కోల్పోయిన సంఘాల విమర్శలకు టియుడబ్ల్యూజే ఐజేయు అదరదు, బెదరదు అని స్పష్టం చేశారు. వార్ వన్ సైడ్ అయిపోయిందని, జర్నలిస్టులు అందరూ కూడా టీయూడబ్ల్యూజే ఐజేయు పక్షాన ఉన్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జే ఐజేయు ఎలక్ట్రానిక్ మీడియా సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బత్తుల మల్లికార్జున్, జిల్లా నాయకులు పులుసు నాగరాజు, తండు వెంకన్న, కందుకూరి యాదగిరి, షేక్ రషీద్, రామకృష్ణ, దుస్స చంద్రశేఖర్, గుంటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు అజ్మీరా విక్రమ్ నాయక్, వల్లపట్ల రవి, సాంబ చారి, అనంతుల శ్రీనివాస్ గౌడ్, చెరుకు శ్రీనివాస్, గుండేటి సత్యనారాయణ, దేసోజు రవి, తప్సీ అనిల్ కుమార్, మధు తదితరులకు సభ్యత్వం అందజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News