Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:38 AM

తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ.

10-04-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణలో నిరుద్యోగులకు హామీ ఇచ్చిన ఉద్యోగాలను భర్తీ చేయకుండా, ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ సూచించారు.

భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తిప్పర్తి మండలం దుప్పలపల్లి, అంతయ్యగూడెం గ్రామాల్లో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లం మహేష్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు అమలు చేయకపోవడం నిరుద్యోగులను మోసం చేయడమేనని విమర్శించారు.

గత ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ల ద్వారా కొద్ది ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని, ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వంపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టకుండా, ప్రజల కష్టార్జితాన్ని ఇతర రాష్ట్రాల్లో ప్రకటనల రూపంలో ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలని, లేనిపక్షంలో నిరుద్యోగులు ఐక్యంగా ఉద్యమిస్తారని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు పోకల శశిధర్, నాయకులు సోమనబోయిన రాజేష్, కన్నెబోయిన శంకర్, మైల సైదులు, దొంగరి అచ్యుత్, గుర్రాల విగ్నేష్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News