Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:28 AM

తెలంగాణకు అవమానం.. బీజేపీ క్షమాపణ చెప్పాలి: డివైఎఫ్ఐ

17-04-2026 74 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ: తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ పార్టీ క్షమాపణ చెప్పాలని డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్, జిల్లా ఉపాధ్యక్షుడు గుండాల నరేష్ డిమాండ్ చేశారు. నల్లగొండలో నిర్వహించిన డివైఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు.

పార్లమెంట్‌లో డిలిమిటేషన్ చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఆంధ్ర–తెలంగాణ విభజనను భారత్–పాకిస్తాన్ విభజనతో పోల్చడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. బాధ్యతగల ప్రజాప్రతినిధి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదని, ఆయన వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.

తెలంగాణ రాష్ట్రం విద్యార్థులు, నిరుద్యోగుల త్యాగాలతో ఏర్పడిందని గుర్తు చేస్తూ, విభజన సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. డిలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు.

తెలంగాణపై అవమానకర వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరిస్తూ, వెంటనే బీజేపీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు..ఈ సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి, నాగయ్య, శివ, సాయి, మహేష్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

తెలంగాణకు అవమానం.. బీజేపీ క్షమాపణ చెప్పాలి: డివైఎఫ్ఐ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News