Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:54 PM

తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలి

తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలి

తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలి
21-04-2026 119 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డికి వినతిపత్రం అందజేత

ఇంటి స్థలం, పింఛను మంజూరు చేయాలని డిమాండ్‌

మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఉద్యమకారులను ప్రభుత్వం తక్షణమే గుర్తించి ఆదుకోవాలని చౌటుప్పల్ మండల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు కోరారు. మంగళవారం మునుగోడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసి తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఉద్యమకారులు మాట్లాడుతూ.. స్వరాష్ట్ర కాంక్షతో ఆనాడు అన్నీ వదులుకొని, ఉద్యమమే ఊపిరిగా పోరాటంలో పాల్గొన్నామని గుర్తుచేశారు. ఆ సమయంలో తమపై నమోదైన పోలీసు కేసులు, జైలు జీవితం వల్ల ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి ఉద్యమకారుడిని గుర్తించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.​ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలం కేటాయించి, ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలి.​వయస్సుతో నిమిత్తం లేకుండా ఉద్యమకారులందరికీ పింఛన్లు మంజూరు చేయాలి.​ఉచిత వైద్యం కోసం హెల్త్ కార్డులు, ప్రయాణాల కోసం బస్ పాసులు మంజూరు చేయాలి.​ఇప్పటికీ నిరుద్యోగులుగా ఉన్న అమరవీరుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలి.​అధికార పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ఉద్యమకారులకు ప్రాధాన్యతనిస్తూ నామినేటెడ్ పదవులు ఇవ్వాలి.​ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం నాయకులు కట్టెల లింగస్వామి, పెద్దగొని రమేష్, ఫకీరు శ్రీనివాస్ రెడ్డి, బోరం ప్రకాశ్ రెడ్డి, ఎస్.కె మున్న, గుంటొజు ఆంజనేయచారి, ఎండి ఇబ్రహీం, సంగిశెట్టి జనార్ధన్, రిక్కల ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News