Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:46 AM

తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలి

తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలి

తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలి
30-03-2026 100 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గుర్తింపు కార్డులు, పింఛన్‌ల కోసం ఉద్యమకారుల డిమాండ్

రామన్నపేట: తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ఉద్యమకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఉద్యమకారుల ఫోరం నాయకులు ప్రభుత్వానికి పలు కీలక డిమాండ్లు వినిపించారు.

ఉద్యమకారుల గుర్తింపునకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి నిజమైన ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. ప్రతి ఉద్యమకారుడికి 250 చదరపు గజాల స్థలం, నెలకు రూ.25 వేల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలను ఆదుకోవాలని, ఉద్యమకారులకు రూ.10 లక్షల మెడికల్ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు.

అలాగే ఉద్యమకారుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి రూ.10 వేల కోట్ల నిధులతో ఆదుకోవాలని, ఉద్యమకారులపై ఉన్న కేసులను పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం రామన్నపేట మండలాధ్యక్షులు నోముల శంకర్, రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ చాంద్, మండల ఉపాధ్యక్షులు బొడ్డుపల్లి లింగయ్య, ఉద్యమ నాయకులు ఎండి ఇమామ్, బోగారం మాజీ ఉపసర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News