Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:25 AM

టెండర్ల ద్వారా దుకాణాల కేటాయింపు చేపట్టాలి: కర్రె ప్రవీణ్

21-04-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండపై కొనసాగుతున్న వర్తక సంఘాన్ని తక్షణం రద్దు చేయాలని బీజేపీ పట్టణ శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.

పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ మాట్లాడుతూ, కొండపై వర్తక సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న దుకాణాలను టెండర్ విధానం లేకుండా పునరుద్ధరిస్తూ (రెన్యువల్) కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఇది దేవస్థానం ఆదాయానికి గండికొడుతోందని, స్థానిక వ్యాపారులు, నిరుద్యోగులు, భూ బాధితులకు అన్యాయం జరుగుతోందన్నారు.

ప్రస్తుతం వర్తక సంఘం పేరిట ఉన్న 112 తాత్కాలిక దుకాణాల్లో 10 దుకాణాలు కొనసాగుతున్నాయని, వీటి గడువు మే 31తో ముగుస్తుందని తెలిపారు. ప్రతి సంవత్సరం టెండర్ల ద్వారా కొత్త, పాత వారికి అవకాశాలు కల్పించే విధానం అమలు చేయాలని కోరారు. టెండర్ల ద్వారా దుకాణాలను కేటాయిస్తే దేవస్థానానికి సుమారు రూ.20–30 కోట్ల ఆదాయం వచ్చే అవకాశముందని పేర్కొన్నారు.

ఎండోమెంట్ చట్టం ప్రకారం ఒకే దుకాణాన్ని పలు మార్లు పునరుద్ధరించడం చట్ట విరుద్ధమని, ఈ ప్రక్రియలో అవినీతి జరుగుతోందని విమర్శించారు. ముడుపుల ఆధారంగా వేర్వేరు నిబంధనలు అమలు చేయడం తగదని, అన్ని టెండర్లు పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి మందోజి నరేష్, శివరాత్రి శ్రీశైలం, బోగా అజయ్, శ్రీనాథ్, విజయ్, ప్రవీణ్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

టెండర్ల ద్వారా దుకాణాల కేటాయింపు చేపట్టాలి: కర్రె ప్రవీణ్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News