Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:21 AM

టీబీ నిర్మూలనపై కేంద్ర బృందం సమీక్ష.

టీబీ నిర్మూలనపై కేంద్ర బృందం సమీక్ష.

టీబీ నిర్మూలనపై కేంద్ర బృందం సమీక్ష.
23-04-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట/భువనగిరి

టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వ బృందం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించి టీబీ నిర్మూలన చర్యలను సమీక్షించింది.

సెంట్రల్ టీబీ డివిజన్ అదనపు కమిషనర్ డా. వీణా ధావన్, రాష్ట్ర టీబీ జాయింట్ డైరెక్టర్ డా. రాజేశం, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. మనోహర్ యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆరోగ్య కేంద్రంలో టీబీ రోగులకు అందుతున్న చికిత్సలు, మందులు, పరీక్షలపై బృందం సమీక్ష నిర్వహించింది. రోగులతో మాట్లాడి సేవలపై వివరాలు తెలుసుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య మాట్లాడుతూ, టీబీ బాధితులు వైద్యులు సూచించిన విధంగా DOTS చికిత్సను క్రమం తప్పకుండా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం రోగులకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు.

తదుపరి బృందం కాచారం గ్రామంలో నిర్వహిస్తున్న టీబీ స్క్రీనింగ్ శిబిరాన్ని సందర్శించి మొబైల్ ఎక్స్‌రే పరీక్షలు, స్క్రీనింగ్ విధానాన్ని పరిశీలించింది. ప్రజలతో మాట్లాడి అందుతున్న ఆరోగ్య సేవలపై వివరాలు తెలుసుకుంది.

అనంతరం అదనపు కలెక్టర్ భాస్కరరావును కలసి జిల్లాలో టీబీ నిర్మూలన చర్యలపై వివరాలు అందించారు. జిల్లాలో అందిస్తున్న వైద్య సేవలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేయగా, కేంద్ర బృందం ప్రభుత్వ చర్యలను ప్రశంసించింది.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. సుమన్ కళ్యాణ్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. వంశీకృష్ణ, టీబీ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

టీబీ నిర్మూలనపై కేంద్ర బృందం సమీక్ష.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News