Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:37 AM

ట్యాంక్‌బండ్‌పై ‘ఏంఎన్‌ఎస్’ బ్లాక్ సెల్యూట్ ర్యాలీ

15-04-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం (ఏంఎన్‌ఎస్) ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్ వద్ద నిర్వహించిన ‘బ్లాక్ సెల్యూట్’ ర్యాలీ భారీగా జరిగింది. నాలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా కార్యకర్తలు తరలివచ్చి నగరాన్ని నల్లరంగులో ముంచెత్తారు.

సంఘం జాతీయ అధ్యక్షుడు డా. బైరి నరేష్, జాతీయ సమన్వయకర్త గాండ్ల సుజాత టీచర్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సమాజంలో వైజ్ఞానిక దృక్పథం పెంపొందించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.

125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీని మంత్రి లక్ష్మణ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. డప్పు నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వేలాది మందితో రాజ్యాంగ పీఠిక పఠనం చేయించి, మూఢనమ్మకాల నిర్మూలనకు ప్రతిజ్ఞ చేయించారు.

కార్యక్రమంలో భాగంగా ‘పుస్తక యోగ’, ‘అక్షరధ్యానం’ వంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహించగా, చిన్నారులకు అక్షరాభ్యాసం, ప్రత్యామ్నాయ పద్ధతిలో దండల పెళ్లిళ్లు నిర్వహించారు.

ర్యాలీ అనంతరం ప్రభుత్వం నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి డా. బైరి నరేష్ పాల్గొన్నారు. అంబేద్కర్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, మూఢనమ్మకాల నిర్మూలనకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని సీఎం కు వినతిపత్రం అందజేశారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, అకునూరి మురళి, సీ. అంజనేయ రెడ్డి తదితరులు హేతువాద దృక్పథంపై మాట్లాడారు. ప్రతి ఇల్లు విజ్ఞాన కేంద్రంగా మారాలని, మూఢనమ్మకాలపై యువత పోరాడాలని డా. బైరి నరేష్ పిలుపునిచ్చారు.

Sthanikam

ట్యాంక్‌బండ్‌పై ‘ఏంఎన్‌ఎస్’ బ్లాక్ సెల్యూట్ ర్యాలీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News