Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం 10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 05:01 PM

సిపిఎం సీనియర్ నాయకుడు దాట్ల చంద్రయ్యకు ఘన నివాళులు

సిపిఎం సీనియర్ నాయకుడు దాట్ల చంద్రయ్యకు ఘన నివాళులు

సిపిఎం సీనియర్ నాయకుడు దాట్ల చంద్రయ్యకు ఘన నివాళులు
March 10, 2026 05:59 PM 271 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జుజ్జలరావుపేట గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ నాయకుడు దాట్ల చంద్రయ్య గుండెపోటుతో అకాల మరణం చెందడం పట్ల పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన భౌతికకాయంపై ఎర్రజెండా కప్పి పుష్పగుచ్చాలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సిపిఎం పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేష్ మాట్లాడుతూ దాట్ల చంద్రయ్య పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేసిన నాయకుడని అన్నారు. సిపిఎం పార్టీలో ఆదర్శవంతమైన నాయకుడిగా ఎదిగి ప్రజల కోసం నిరంతరం పనిచేశారని పేర్కొన్నారు. ఆయన అకాల మరణం పార్టీకి తీరని లోటని తెలిపారు. నేటి యువత దాట్ల చంద్రయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.

అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. పార్టీ ఎల్లవేళలా వారి కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం కూసుమంచి మండల కార్యదర్శి తోటకూరి రాజశేఖర్, జిల్లా నాయకులు మల్లెల సన్మంతరావు, షేక్ బషీర్, పాలేరు డివిజన్ నాయకులు సేలం గురుమూర్తి, ఎడవెల్లి రమణారెడ్డి, మండల నాయకులు ఎస్.కె బాబు, జుజ్జలరావుపేట గ్రామ సీనియర్ నాయకులు వెల్లంపల్లి అశోక్, గ్రామ సర్పంచ్ దాట్ల సలీం, గ్రామ నాయకులు బక్కతట్రమేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు, వివిధ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున హాజరై చంద్రయ్యకు జోహార్లు అర్పించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News