Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏసీబీ వలలో సూర్యాపేట టౌన్‌ ప్లానింగ్‌ అధికారి! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 11:12 AM

శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ అంతర్జాతీయ పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు

28-02-2026 247 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

సూర్యాపేట మండలం చివ్వెంల ఉండ్రుగొండ సమీపంలోని శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ అంతర్జాతీయ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. మండల విద్యాధికారి కళారాణి, పూజ్యపాద్ మంత్రస్వరూప్ దాస్ జి స్వామీజీ, పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఆనంద్, డైరెక్టర్ హార్దిక్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సుమారు 392 శాస్త్రీయ నమూనాలు, ప్రాజెక్టులను ప్రదర్శించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఆనంద్ మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించాల్సిన అవసరం ఉందని, విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తి పెరిగితేనే భావి శాస్త్రవేత్తలుగా ఎదుగుతారని పేర్కొన్నారు. సైన్స్ ఫెయిర్ వంటి వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసే వేదికలని తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు నమూనాలు, ప్రాజెక్టులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Sthanikam

శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ అంతర్జాతీయ పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు

Article Image

సూర్యాపేట మండలం చివ్వెంల ఉండ్రుగొండ సమీపంలోని శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ అంతర్జాతీయ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. మండల విద్యాధికారి కళారాణి, పూజ్యపాద్ మంత్రస్వరూప్ దాస్ జి స్వామీజీ, పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఆనంద్, డైరెక్టర్ హార్దిక్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సుమారు 392 శాస్త్రీయ నమూనాలు, ప్రాజెక్టులను ప్రదర్శించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఆనంద్ మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించాల్సిన అవసరం ఉందని, విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తి పెరిగితేనే భావి శాస్త్రవేత్తలుగా ఎదుగుతారని పేర్కొన్నారు. సైన్స్ ఫెయిర్ వంటి వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసే వేదికలని తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు నమూనాలు, ప్రాజెక్టులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మీ స్పందన? 5 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News