Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:27 AM

శానిటేషన్ ఇన్స్పెక్టర్ సస్పెండ్ చేయాలని అదనపు కలెక్టర్కు వినతి

25-04-2026 57 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట,:

పట్టణంలో దేవస్థాన భూమిలో అక్రమంగా షెడ్డు నిర్మాణం జరిగిందని ఆరోపిస్తూ సంబంధిత శానిటేషన్ ఇన్స్పెక్టర్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌లకు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు Karre Praveen మాట్లాడుతూ దేవస్థానం ఈఓ నుంచి సింహద్వారం సమీపంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని నోటీసులు జారీ చేసినప్పటికీ అవి పట్టించుకోకుండా షెడ్డు నిర్మాణం చేపట్టారని ఆరోపించారు.

మున్సిపల్ కమిషనర్‌కు సమాచారం లేకుండానే, పట్టణ ప్రణాళిక అధికారుల అనుమతి లేకుండా, మున్సిపల్ తీర్మానం లేకుండా నిర్మాణం ఎలా జరిగిందని ప్రశ్నించారు. శానిటేషన్ ఇన్స్పెక్టర్ స్వయంగా షెడ్డు నిర్మాణం తానే చేపట్టినట్లు మీడియా సమావేశంలో చెప్పడం అనుమానాలకు తావిస్తోందన్నారు.

అక్రమ నిర్మాణంలో స్థానిక ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని ఆరోపిస్తూ, సీసీ కెమెరా దృశ్యాలు దీనికి ఆధారమని పేర్కొన్నారు. జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత శానిటేషన్ ఇన్స్పెక్టర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రచ్చ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మందోజు నరేష్, కార్యదర్శులు ప్రభాకర్, కర్ణ, సురేష్, నాయకులు లెంకలపల్లి శ్రీను, బోడ సురేష్, భాస్కర్ రెడ్డి, బుచ్చిబాబు, అజయ్, శ్యామ్, విజయ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

శానిటేషన్ ఇన్స్పెక్టర్ సస్పెండ్ చేయాలని అదనపు కలెక్టర్కు వినతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News