Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:27 AM

స్వయం ఉపాధిపై మహిళలు దృష్టి పెట్టాలి డీఆర్‌డీఏ అధికారి టి. నాగిరెడ్డి

21-04-2026 79 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, మహిళలు స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన పెంచుకుని, శిక్షణతో ముందుకు సాగాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) అధికారి టి. నాగిరెడ్డి సూచించారు. మంగళవారం భువనగిరి జిల్లా కేంద్రంలో సేర్ఫ్ సహకారంతో, ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఉదిత టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్‌లో స్వయం సహాయక సంఘాల మహిళలకు గార్మెంట్ కటింగ్, స్కూల్ యూనిఫార్మ్స్ తయారీపై శిక్షణ ఇచ్చి, అనంతరం ధృవపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ భువనగిరి, వలిగొండ, బీబీనగర్, యాదగిరిగుట్ట, రామన్నపేట, మోత్కూర్, తుర్కపల్లి, బొమ్మలరామారం, రాజపేట మండలాలకు చెందిన సుమారు 200 మంది మహిళలకు కుట్టు శిక్షణ అందించడం అభినందనీయమన్నారు.

జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి కె. జంగారెడ్డి మాట్లాడుతూ శిక్షణ పొందిన మహిళలకు వచ్చే నెలలో ప్రభుత్వ పాఠశాలల యూనిఫాంల తయారీకి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. శిక్షణను క్రమశిక్షణతో సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని మహిళలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ రమణ, భువనగిరి ఏపీఎం మల్లేష్, ఉదిత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు పాశం అలివేలు జనార్ధన్, మోత్కూర్ ట్రైనింగ్ సెంటర్ అధికారి లక్ష్మీనారాయణ, శిక్షణాధ్యాపకులు విజయ, గీత తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

స్వయం ఉపాధిపై మహిళలు దృష్టి పెట్టాలి డీఆర్‌డీఏ అధికారి టి. నాగిరెడ్డి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News