Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:26 AM

స్వయం ఉపాధి అవకాశాలపై మహిళలు ఆశక్తిని పెంచుకోవాలి

21-04-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి టి.నాగిరెడ్డి

మహిళలు స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన, శిక్షణ పొంది ఉపాధి అవకాశాలు కల్పించుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి టీ నాగిరెడ్డి సూచించారు. మంగళవారం భువనగిరి జిల్లా కేంద్రంలో సేర్ఫ్ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ) సహకారంతో ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఉదిత టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్ లో ఏంపవరింగ్ రూరల్ స్వయం సహాయక సంఘాల మహిళలకు గార్మెంట్ కటింగ్,స్కిల్స్ ఫర్ స్కూల్ యూనిఫార్మ్స్ పై శిక్షణ పొందిన మహిళలకు ధృవ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ భువనగిరిలోని ఉదిత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో భువనగిరి,వలిగొండ,బీబీనగర్,యాదగిరిగుట్ట, రామన్నపేట,మోటకొండూరు,తుర్కపల్లి,బొమ్మలరామారం,మరియు రాజపేట మండలాలకు చెందిన సుమారు 200 మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. జిల్లా అడిషనల్ గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి కే.జంగారెడ్డి మాట్లాడుతూ... శిక్షణ పొందిన మహిళలకు వచ్చే నెలలో జిల్లా లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్స్ తయారు చేసే అవకాశాన్ని శిక్షణ పొందిన మహిళలకు కల్పిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ తో శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ రమణ,భువనగిరి ఏపీఎం మల్లేష్,ఉదిత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు పాశం.అలివేలు జనార్ధన్,మోత్కూర్ ట్రైనింగ్ సెంటర్ అధికారి లక్ష్మీనారాయణ, ట్రైనింగ్ టీచర్స్ పబ్బల.విజయ,గీత,మహిళలు పాల్గొన్నారు.

Sthanikam

స్వయం ఉపాధి అవకాశాలపై మహిళలు ఆశక్తిని పెంచుకోవాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News