Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:36 AM

స్వామివారిని దర్శించుకున్న దేవాదాయ కమిషనర్

09-04-2026 76 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని తెలంగాణ దేవాదాయ శాఖ కమిషనర్ ఐఏఎస్ హనుమంతరావు కుటుంబ సమేతంగా గురువారం దర్శించుకున్నారు.

ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో స్వయంభూ నరసింహస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన ఆలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు స్థానాచార్యులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రాచార్యులు వేద ఆశీర్వచనం అందించగా, ఆలయ చైర్మన్ నరసింహమూర్తి స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.

కార్యక్రమంలో ఉప ప్రధాన అర్చకులు మాధవాచార్యులు, సిద్ధార్థాచార్యులు, డీఈవో నవీన్ కుమార్, ఏఈఓలు శంకర్ నాయక్, మహేష్ కుమార్, సూపరింటెండెంట్ సురేందర్ రెడ్డి, రాజన్ బాబు, ఎస్పీఎఫ్ ఆర్ఐ శేషగిరిరావు, ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది నందు నాయక్, అనిల్, ఆలయ ఇంచార్జ్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

స్వామివారిని దర్శించుకున్న దేవాదాయ కమిషనర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News