Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏసీబీ వలలో సూర్యాపేట టౌన్‌ ప్లానింగ్‌ అధికారి! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 11:12 AM

స్వామినారాయణ గురుకుల్ పాఠశాలలో 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత

16-04-2026 160 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

సూర్యాపేటలోని స్వామినారాయణ గురుకుల్ అంతర్జాతీయ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి (సిబిఎస్ఈ) ఫలితాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఘనవిజయాన్ని సాధించాయని పాఠశాల యాజమాన్యం తెలిపింది. గురువారం విడుదలైన ఈ ఫలితాల్లో మొత్తం 98 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరై 100 శాతం ఉత్తీర్ణత సాధించడం పాఠశాలకు గర్వకారణమని పేర్కొన్నారు. ఆర్. ప్రభాత్ 479 మార్కులతో అగ్రస్థానం సాధించగా, కె. జస్వంత్ 473 మార్కులు, పి. డక్షవీర్ రావు 471 మార్కులు సాధించి ప్రతిభ కనబర్చారని తెలిపారు. మొత్తం విద్యార్థుల్లో 88 మంది 70 శాతానికి పైగా, 53 మంది 80 శాతానికి పైగా మార్కులు సాధించడం ద్వారా పాఠశాల విద్యా ప్రమాణాలు మరింత ప్రతిష్ఠాత్మకంగా నిలిచాయని వివరించారు. ఈ ఫలితాలతో పాఠశాల జిల్లా స్థాయిలో డిస్టింక్షన్ మార్కులలో ప్రథమ స్థానాన్ని సాధించి మరోసారి తన ప్రతిభను చాటుకుందని పేర్కొన్నారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల నిబద్ధత, తల్లిదండ్రుల సహకారం కలిసొచ్చిన ఫలితమే ఈ విజయమని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రస్వరూపదాస్ స్వామీజీ, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఆనంద్, డైరెక్టర్ హార్దిక్ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను అభినందించినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి అద్భుత ఫలితాలను కొనసాగిస్తూ మరింత ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేస్తామని ప్రిన్సిపాల్ పేర్కొన్నట్లు తెలిపారు.

Sthanikam

స్వామినారాయణ గురుకుల్ పాఠశాలలో 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News