Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 06:28 PM

సర్పంచులకు శిక్షణ తరగతులు – జిల్లా కలెక్టర్ హనుమంతరావు

17-01-2026 239 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పంచాయతీ శాఖ ఆదేశాలతో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏర్పాట్లు

యాదాద్రి భువనగిరి స్థానికం ప్రధాన ప్రతినిధి

తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో సర్పంచులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారి హనుమంతరావు తెలిపారు. జిల్లాలోని సంబంధిత సర్పంచులు నిర్ణీత తేదీల్లో నిర్వహించే శిక్షణ తరగతులకు తప్పనిసరిగా హాజరై, వాటిని విజయవంతం చేయాలని ఆయన కోరారు.పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ శిక్షణ తరగతులు జిల్లాలోని స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ (SRTRI), జలాల్పూర్ గ్రామం, భూదాన్ పోచంపల్లి మండలంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మండలాల వారీగా బ్యాచులుగా శిక్షణ తరగతులు కొనసాగుతాయని వివరించారు.

శిక్షణ తేదీలు – మండలాల వివరాలు:

జనవరి 19 నుంచి 23, 2026 వరకు

బ్యాచ్ నెంబర్ 1 & 2 – వలిగొండ, భూదాన్ పోచంపల్లి, తుర్కపల్లి.

ఫిబ్రవరి 03 నుంచి 07, 2026 వరకు

బ్యాచ్ 1 & 2 – బొమ్మలరామారం, అడ్డగూడూరు, ఆలేరు, రామన్నపేట.

ఫిబ్రవరి 09 నుంచి 13, 2026 వరకు

బ్యాచ్ 1 & 2 – భువనగిరి, మోత్కూర్, రాజాపేట, యాదగిరిగుట్ట.

ఫిబ్రవరి 17 నుంచి 21, 2026 వరకు

బ్యాచ్ 1 & 2 – బీబీనగర్, చౌటుప్పల్, నారాయణపూర్.

ఫిబ్రవరి 24 నుంచి 28, 2026 వరకు

బ్యాచ్ 1 – గుండాల, మోటకొండూర్, ఆత్మకూరు.

గ్రామాభివృద్ధి కార్యక్రమాల అమలులో సర్పంచుల పాత్ర కీలకమని, శిక్షణ ద్వారా పరిపాలనా నైపుణ్యాలు, బాధ్యతలపై అవగాహన పెరుగుతుందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. నిర్ణీత తేదీల్లో అందరూ హాజరై శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు

Sthanikam

సర్పంచులకు శిక్షణ తరగతులు – జిల్లా కలెక్టర్ హనుమంతరావు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News