Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:34 AM

సామాజిక న్యాయానికి జగ్జీవన్ రామ్ మార్గం ఆదర్శం

06-04-2026 91 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు డా. బాబు జగ్జీవన్ రామ్ అని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ అన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకుని ఆదివారం నల్గొండ పట్టణంలోని ఎన్‌జీ కాలేజ్ సమీపంలో ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. సమాన అవకాశాలు, హక్కుల సాధన కోసం ఆయన చూపిన మార్గంలో నడవడం ద్వారా సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని తెలిపారు. యువత ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని సూచించారు.

అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి పౌరుడు చైతన్యవంతంగా ఉండాలని, హక్కుల కోసం చట్టబద్ధంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నేలపట్ల సత్యనారాయణ, నర్సింగ్ కోటయ్య, దేవరకొండ యాదగిరి, కన్జెర శ్రీను, నాగుల జ్యోతి, సదాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సామాజిక న్యాయానికి జగ్జీవన్ రామ్ మార్గం ఆదర్శం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News