Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భవన నిర్మాణ కార్మిక సంక్షేమ పథకాలు బోర్డు ద్వారానే అమలు చేయాలి 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 05:53 PM

సామాజిక చైతన్యానికి అస్తిత్వ వాదాలే దిక్సూచి: డా. పగడాల నాగేందర్

సామాజిక చైతన్యానికి అస్తిత్వ వాదాలే దిక్సూచి: డా. పగడాల నాగేందర్

సామాజిక చైతన్యానికి అస్తిత్వ వాదాలే దిక్సూచి: డా. పగడాల నాగేందర్
April 15, 2026 05:16 PM 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సాహిత్యం సమాజ మార్పుకు ఆయుధం కావాలి – నాగార్జున కళాశాలలో విస్తృతోపన్యాసం

నాగార్జున కళాశాల,

సామాజిక ఉద్యమాలు, సాహిత్య రంగంలో అస్తిత్వ వాదాల ప్రాధాన్యం ఎప్పటికీ తగ్గదని ప్రముఖ కవి, విమర్శకుడు డా. పగడాల నాగేందర్ స్పష్టం చేశారు. ఇవి సజీవ స్రవంతుల్లా నిరంతరం కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.

బుధవారం నాగార్జున ప్రభుత్వ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఎం.ఏ తెలుగు విద్యార్థులకు “అస్తిత్వ ఉద్యమాలు – ఆరంభ వికాసాలు” అనే అంశంపై ఆయన విస్తృతంగా ఉపన్యసించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్త్రీవాద, దళిత, బహుజన, ముస్లిం మైనార్టీ, ప్రాంతీయ అస్తిత్వ వాదాలు తాత్కాలికం కావని, సమాజంలో ఉన్న అసమానతలపై నిరంతర పోరాటాలని వివరించారు.

అణగారిన వర్గాలు తమ హక్కులు, ఆత్మగౌరవం కోసం గొంతెత్తిన ప్రతిసారీ ఈ వాదాలు కొత్త దిశల్లో విస్తరిస్తాయని చెప్పారు. ప్రజాస్వామ్య సమాజంలో ఇవి ఎప్పటికీ సజీవంగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.

సాహిత్యం కేవలం అలంకారానికి పరిమితం కాకుండా, అస్తిత్వ వాదాలకు ప్రతిబింబంగా నిలిచి సామాజిక మార్పుకు దోహదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రాంతీయ అస్తిత్వ వాదాలు భాష, సంస్కృతి, వనరుల పరిరక్షణకు బలమైన పునాది వేస్తాయని విశ్లేషించారు.

“ప్రశ్నించే గొంతు ఉన్నంత కాలం, ఆత్మగౌరవ పోరాటం కొనసాగినంత వరకు అస్తిత్వ వాదాలకు అంతం లేదు. ఇవే సమాజ పురోగతికి ఇంధనం” అని నాగేందర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్, తెలుగు విభాగాధిపతి డా. వెల్దండి శ్రీధర్, డా. వాస భూపాల్, డా. టంగుటూరి సైదులు తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News