Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:42 AM

సామాజిక అధికారమే కాన్షిరాం లక్ష్యం

సామాజిక అధికారమే కాన్షిరాం లక్ష్యం

సామాజిక అధికారమే కాన్షిరాం లక్ష్యం
15-03-2026 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

92వ జయంతి సందర్భంగా కక్కిరేణిలో ఘన నివాళి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామంలో బహుజన సామాజిక విప్లవకారుడు కాన్షిరాం రమ్ 92వ జయంతి సందర్భంగా సామాజిక న్యాయ కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ సోమనబోయిన సింహాద్రి మాట్లాడుతూ, బహుజన సమాజానికి అధికారాన్ని అందించాలనే లక్ష్యంతో కాన్షిరాం బహుజన సమాజ్ పార్టీ ను స్థాపించి దేశ రాజకీయాల్లో కొత్త దిశను చూపారని తెలిపారు. సమాజ్‌వాది నాయకుడు మూలయం సింగ్ యాదవ్తో కలిసి 1993లో ఉత్తర్ ప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేసి సామాజిక మార్పుకు నాంది పలికారన్నారు.

పేదలు, దళితులు, మైనారిటీలు, వెనుకబడిన వర్గాలను ప్రజాస్వామ్య పద్ధతిలో అధికారంలోకి తీసుకురావచ్చని కాన్షిరాం నిరూపించారని ఆయన పేర్కొన్నారు. జ్యోతిరావు ఫూలే , B. R. అంబేద్కర్ , కాన్షిరాం, మండల్ భావజాలంతోనే సామాజిక మార్పు సాధ్యమని తెలిపారు. కుల గణన, రాజ్యాంగ పరిరక్షణ, హక్కుల సాధన కోసం ఉద్యమాలు బలోపేతం అయినప్పుడే భారత రాజకీయాల్లో కుల విముక్తి సాధ్యమవుతుందని అన్నారు.

అనంతరం గ్రామ పెద్దలు కలిసి ప్రొఫెసర్ సింహాద్రిని శాలువా కప్పి సత్కరించారు.

ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు వేముల సైదులు, నూకల యాదయ్య, సోమనబోయిన ఆదినారాయణ, భాషకార్ల నరేందర్ రెడ్డి, శిగ రాజు గౌడ్, కన్నేబోయిన యాదయ్య, మల్లేష్, నరసింహ, అంకిరెడ్డి యాదయ్య ముదిరాజ్, నల్ల ప్రసాద్, యాదయ్య, స్వామి, చిర్రబోయిన సత్యనారాయణ, వేలిజాల నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సామాజిక అధికారమే కాన్షిరాం లక్ష్యం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News