Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏసీబీ వలలో సూర్యాపేట టౌన్‌ ప్లానింగ్‌ అధికారి! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 11:10 AM

రోడ్డు భద్రతపై కదం తొక్కిన సూర్యాపేట జిల్లా పోలీస్

18-04-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

సూర్యాపేట పట్టణ కేంద్రంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే ఉద్దేశంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. శనివారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత కార్యక్రమం చేపట్టి ఈ ర్యాలీ నిర్వహించినట్లు పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ కోర్టు చౌరస్తా, పిఎస్ఆర్ సెంటర్, శంకర్ విలాస్ సెంటర్, ఎంజీ రోడ్డు మీదుగా కొత్త బస్టాండ్ వరకు సాగిందని తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది హెల్మెట్‌లు ధరించి పాల్గొనగా, ఎస్పీ నరసింహ అదనపు ఎస్పీలు, డీఎస్పీలతో కలిసి ర్యాలీని ముందుండి నడిపినట్లు పేర్కొన్నారు. కొత్త బస్టాండ్ వద్ద రోడ్డు భద్రతపై మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేసినట్లు తెలిపారు.

రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు, వాహనదారులు భాగస్వామ్యం కావాలని ఎస్పీ నరసింహ సూచించారు. మద్యం మత్తులో వాహనాలు నడపకూడదని, రాంగ్ రూట్‌లో ప్రయాణించవద్దని, పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని తెలిపారు. ప్రయాణ సమయంలో హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించవద్దని పేర్కొన్నారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన పెంచుతున్నట్లు వివరించారు.

ఈ కార్యక్రమానికి స్పందించిన సూర్యాపేటకు చెందిన సెవెన్ స్టార్ సోలార్ ఎంటర్ప్రైజెస్ యజమాని మల్లేష్ పోలీసు సిబ్బందికి హెల్మెట్‌లు అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా హెల్మెట్‌లు అందించినందుకు గాను మల్లేష్‌ను ఎస్పీ నరసింహ సన్మానించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, డీఎస్పీలు ప్రసన్నకుమార్, నరసింహాచారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఆర్ముడ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు

Sthanikam

రోడ్డు భద్రతపై కదం తొక్కిన సూర్యాపేట జిల్లా పోలీస్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News