Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వర్షాభావ పరిస్థితుల్లో పత్తి పంటను కాపాడుకోండి: వ్యవసాయ అధికారి సంతోష్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:20 PM

రోడ్డు భద్రత అందరి బాధ్యత: చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్

16-04-2026 117 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పట్టణంలో గురువారం 'సోషల్ మీడియా అవగాహన కార్యక్రమం' ఘనంగా నిర్వహించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా నాలుగో రోజున చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ ఆధ్వర్యంలో డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆటో, బస్సు, టాక్సీ, స్కూల్ బస్సు డ్రైవర్లతో ఇన్‌స్పెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా వాహనాలు నడపాలని ఆయన సూచించారు .డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇన్సూరెన్స్ వంటి ధృవీకరణ పత్రాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ముఖ్యంగా ఓవర్‌లోడింగ్, మితిమీరిన వేగం, ప్రమాదకర డ్రైవింగ్‌పై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్ డ్రైవర్లు సీట్‌బెల్ట్ ధరించడం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని అవగాహన కల్పించారు.

సోషల్ మీడియా ప్రచారం:

సామాన్య ప్రజలకు, యువతకు అవగాహన కల్పించేందుకు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికల ద్వారా రోడ్డు నిబంధనలపై రూపొందించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు (ఎన్ జీ ఓ) భాగస్వాములయ్యారు.​"ప్రతి డ్రైవర్ బాధ్యతగా వాహనం నడిపినప్పుడే సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుంది. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు." చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్,

Sthanikam

రోడ్డు భద్రత అందరి బాధ్యత: చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News