Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:23 AM

రేపటి నుంచి స్వీయ లెక్కల నమోదు ప్రారంభం.భారతి హాలికేరి

25-04-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌

జనగణన–2027లో భాగంగా తెలంగాణలో స్వీయ లెక్కల నమోదు ప్రక్రియ ఈ నెల 26 నుంచి మే 10 వరకు నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ భారతి హాలికేరి తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి జనగణన ఇదేనని, డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్న మొదటి జనగణనగా ఇది ప్రత్యేకత సంతరించుకుందని పేర్కొన్నారు. స్వాతంత్య్రం తర్వాత మొదటిసారి కులగణన చేపడుతున్న నేపథ్యంలో ఈ జనగణనకు మరింత ప్రాధాన్యం ఉందన్నారు. ఈసారి స్వీయ లెక్కల నమోదు విధానాన్ని ప్రవేశపెట్టి ప్రజలు నేరుగా తమ వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించామని చెప్పారు.

ప్రజలు ఆన్లైన్ ద్వారా స్వచ్ఛందంగా తమ వివరాలు నమోదు చేసుకోవచ్చని, ఇది తప్పనిసరి కాదని స్పష్టం చేశారు. దీని వల్ల సమాచారం సేకరణ వేగవంతమవడంతో పాటు గణన సిబ్బంది పనిభారం తగ్గుతుందని వివరించారు. తెలుగు, హిందీ, ఆంగ్లం సహా 16 భాషల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని, సమాచారం భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు.

మొత్తం 33 ప్రశ్నల్లో 27 ప్రశ్నలకు స్వీయ లెక్కల నమోదు ద్వారా సమాధానాలు ఇవ్వవచ్చని, మిగిలిన ప్రశ్నలను గణన సిబ్బంది నమోదు చేస్తారని పేర్కొన్నారు. ఎలాంటి పత్రాలు లేదా చిత్రాలు జత చేయాల్సిన అవసరం లేదని, ఎక్కడినుంచైనా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చని చెప్పారు.

జనగణన ద్వారా లభించే సమాచారం అభివృద్ధి ప్రణాళికలకు కీలకమని, ప్రజలు ఖచ్చితమైన వివరాలు అందించాలని ఆమె కోరారు.

ఈ సందర్భంగా మహానగర పాలక సంస్థ కమిషనర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సంబంధిత ప్రాంతాల్లో వేలాది గణన సిబ్బంది, పర్యవేక్షకులు విధుల్లో ఉంటారని వెల్లడించారు.

అనంతరం జనగణన పోస్టర్లు, ప్రచార సామగ్రిని ఆవిష్కరించారు.

Sthanikam

రేపటి నుంచి స్వీయ లెక్కల నమోదు ప్రారంభం.భారతి హాలికేరి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News